గారడి చేస్తుండ్రు గడిబిడి చేస్తున్రు
తొండికి దిగుతున్రు మొండికి పోతున్రు
బెమాను నాయకులూ బెతాలా మాంత్రికులు
బాజారున దూకిన్రు బాఘోతం అడిన్రు
ఏ అరవై ఎల్ల యుద్దంలోన పొద్దూ పోడిసేను
అరె అద్దమ రాతిరి తెలంగాణా ముద్దుగ వస్తేను
నోటి కాడికి వచ్చిన బుక్కకు అడ్డం పడుతున్రు
అరె రారే రారే నాలిముచ్చుల నాటకాలకు పరదా తిస్తుండ్రు
"గారడి చేస్తుండ్రు" ............!
వోట్లకు వచ్చి జనం ముంగట జై జై అన్నారు
వీరి మాటలకూ అఖిల పక్షముల సై సై అన్నారు
పంపకాలకు దిగయ్యలకు అడ్డంపడుతుండ్రు
గజకర్ణ గోకర్ణ విద్యలతో మాయలు పన్నిండ్రు
మంది కొమ్పలె మున్చిండ్రు
విరు మస్తుగా ఆస్తులు పెంచిండ్రు
భూతాలోలె పట్టిండ్రు
విలు భూములు కబ్జా పెట్టిండ్రు
ఇగ దోపిడీ కోటలు కులుతున్నాయని లబలబలాడిండ్రు.............. హొయ్
పల్లేరు కయలోలె సర్కారు తుమ్మలోలె సమైక్య వదులాయే
"గారడి చేస్తుండ్రు" ............!
పార్టీలన్నీ పక్కకు పెట్టి దోస్తీ కట్టిండ్రు
జన్డాలన్ని బందుకు పెట్టి బందువులయ్యిండ్రు
దిక్కు మలినా దీక్షలు పట్టి దిల్లకులదిండ్రు
గుద్దులాడుకునే నాయకులంతా ముద్దులాడుకుండ్రు
కిరాయి మూకల పోరాటం ఇది కిరికిరి పెట్టె చెలగాటం
జనముకు పట్టని జంజాటం
ఇది దోపిడీదారుల ఆరాటం
బతుకే బ్యారం లంబాచారం అంతా వ్యాపారం
మనుషుల వ్యాపారం వీళ్ళ మనసులు వ్యాపారం
జగడం వ్యాపారం వీళ్ళకు జనమే వ్యాపారం
"గారడి చేస్తుండ్రు" ............!
Lyrics : KCR
Lyrics submitted by Fans of Telangana.
జై తెలంగాణ.... ! జై జై తెలంగాణ.....!!